News January 24, 2026

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

image

AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు 2 సెషన్లలో (9.00 AM-12.00PM, 2.00PM-5.00PM) ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్/ ఆధార్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. <>వెబ్‌సైట్‌<<>>లో, మన మిత్ర సర్వీసు(9552300009)లో అందుబాటులో ఉన్నట్లు చెప్పింది.

Similar News

News February 18, 2026

‘నేను ఇండియాకు రాలేను’.. బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

image

తాను భారత్‌కు తిరిగి రాలేనని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా బాంబే హైకోర్టుకు తెలిపారు. తన వద్ద యాక్టివ్ పాస్‌పోర్టు లేదని, పైగా బ్రిటన్ విడిచి వెళ్లకుండా అక్కడి కోర్టుల ఆంక్షలు ఉన్నాయని ఆయన తరఫు లాయర్ అమిత్ దేశాయ్ తెలిపారు. భారత్‌కు రానంత వరకు మాల్యా పిటిషన్లను విచారించబోమని చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ నేతృత్వంలోని ధర్మాసనం గతవారం స్పష్టం చేయడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

News February 18, 2026

అజిత్ పవార్ దుర్మరణం రోజే 75 ఫైళ్లు క్లియర్.. ఎలా సాధ్యం?

image

జనవరి 28న అజిత్ పవార్ విమాన ప్రమాద వార్తతో మహారాష్ట్ర మొత్తం షాక్‌లో ఉంటే ఆ రాష్ట్ర మైనారిటీ శాఖ మాత్రం అదే రోజు ఏకంగా 75 స్కూల్ ఫైళ్లను క్లియర్ చేసేసింది. ఒక్క రోజులోనే ఇన్ని ఫైళ్లపై సంతకాలు ఎలా చేశారంటూ విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రచ్చ ముదరడంతో డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్‌పై బదిలీ వేటు పడింది. దీని వెనక ఏదో మతలబు ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

News February 18, 2026

ఆపరేషన్ సిందూర్‌పై సినిమా!

image

కశ్మీర్ ఫైల్స్, వ్యాక్సిన్ వార్, బెంగాల్ ఫైల్స్ వంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఆపరేషన్ సిందూర్‌పై సినిమా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం నిర్మాత భూషణ్ కుమార్‌తో సంప్రదింపులు పూర్తయ్యాయని తెలుస్తోంది. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత మిలిటరీ స్ట్రైక్స్‌ను ఇందులో చూపించనున్నట్లు సమాచారం. నటీనటులు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.