News January 24, 2026

రొంపిచర్ల: ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న మిస్సింగ్ యువతి

image

రొంపిచర్ల R బెస్తపల్లిలో మూడో రోజుల క్రితం మిస్సయిన తేజశ్రీ(20) అనే యువతి తను ప్రేమించిన యువకుడు యోగేంద్ర రెడ్డి (24)ని పెళ్లి చేసుకుందని రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ తెలిపారు. వీరు భాకరాపేట సమీపంలోని దేవరకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారని చెప్పారు. మేజర్లు కావడంతో ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News January 28, 2026

అందుబాటులోకి ఆయుష్మాన్ భారత్ కార్డులు

image

చిత్తూరు జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో సుమారు 20 లక్షల మంది ఉన్నారు. వీరిలో 17 లక్షల మంది వివరాలను కార్డులో అధికారులు నమోదు చేయించారు. రోగి పూర్తి వివరాలు కార్డు స్కాన్ చేయడం ద్వారా వైద్యులకు తెలిసిపోతుంది. తద్వారా వైద్య సేవలు అందించడం సులభతరం కానుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లోనే కాకుండా జిల్లా, ఏరియా, సిహెచ్సీలోనూ వీటి ద్వారా వైద్య సేవలు అందనున్నాయి.

News January 28, 2026

చిత్తూరుకు మరో 450 టన్నుల యూరియా

image

కడప జిల్లా నుంచి మరో 450 టన్నుల యూరియా చిత్తూరు జిల్లాకు బుధవారం రానుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,301 టన్నుల యూరియా నిల్వలున్నాయన్నారు. వీటిని 230 రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందిస్తున్నామని వెల్లడించారు.

News January 28, 2026

రోడ్డు ఏర్పాటుకు రూ.18.30 కోట్లు మంజూరు

image

కుప్పం (M) మల్లానూరు నుంచి అడవి బూదుగూరు మీదుగా తమిళనాడు బోర్డర్ వరకు రోడ్డు ఏర్పాటుకు రూ.18.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్లనూరు నుంచి తమిళనాడు బోర్డర్ వరకు సింగల్ రోడ్డు ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ నిధులు మంజూరు చేసింది.