News April 27, 2024
ఒంగోలు: రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి

బీపీఈడీ, డీపీఈడీ విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం మే 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కేఎస్. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయినా విద్యార్థినీ, విద్యార్థులు రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రాలు కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News September 10, 2025
రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రభావం ప్రకాశం జిల్లాపై సైతం పడుతుందని పేర్కొంది. దీంతో ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో నేటి సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి.
News September 10, 2025
ఆందోళన చెందవద్దని.. ప్రకాశం కలెక్టర్ పిలుపు!

రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం ముండ్లమూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో యూరియా సరఫరా, పంపిణీపై రైతులకు అవగాహన కలిగించే ఉద్దేశంతో చేపట్టిన మెగా అవుట్ రీచ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.
News September 10, 2025
ప్రకాశం: పోస్టల్ స్కాలర్‌షిప్ పొందాలని ఉందా?

ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏటా దీన్ దయాల్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు అర్హత పొందేందుకు రాత పరీక్ష, ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 30న రీజనల్ స్థాయి పరీక్ష ఉండగా, ఆసక్తి కలవారు ఈ నెల 16లోగా స్థానిక పోస్టాఫీస్‌ను సంప్రదించాలి.