News January 24, 2026

ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>ఢిల్లీ 45 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 30న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MCh/DM, పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. ఫుల్ టైమ్ స్పెషలిస్టుకు 69 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/

Similar News

News April 8, 2026

Whatsappలో అదిరిపోయే ఫీచర్..

image

వాట్సాప్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇకపై మీ మొబైల్ నంబర్‌తో పనిలేకుండానే యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఫోన్ నంబర్ ఇతరులకు షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆండ్రాయిడ్, IOS యూజర్లకు దశలవారీగా ఈ సదుపాయం లభించనుంది. కొత్త వ్యక్తులతో చాట్ చేసేటప్పుడు మీ నంబర్ కనిపించదు కాబట్టి, ఇది యూజర్ల ప్రైవసీకి మరింత భద్రతను ఇవ్వనుంది.

News April 8, 2026

సెలూన్ షాపు నడిపే వ్యక్తికి రూ.70 లక్షల GST నోటీసులా?

image

AP: విజయవాడలో సెలూన్ షాపు నడిపే తనకు రూ.70లక్షల GST నోటీసులు వచ్చాయని శ్రీనివాసరావు అనే వ్యక్తి వాపోయారు. 40ఏళ్లుగా పంజా సెంటర్‌లో చిన్నషాపుతో జీవనం సాగిస్తున్నానని తెలిపారు. తనకు విశాఖలో ఐరన్ స్క్రాప్ వ్యాపారం ఉన్నట్లు GST అధికారులు రికార్డులు చూపిస్తున్నారని, వారి ఆదేశాలతో తన బ్యాంకు ఖాతాను నిలిపేశారని వాపోయారు. తనకు ఏ వ్యాపారం లేదని చెప్పినా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 8, 2026

సీజ్‌ఫైర్ ఎఫెక్ట్.. రూ.16.59 లక్షల కోట్ల లాభం

image

ఇరాన్-US మధ్య <<19594903>>సీజ్‌ఫైర్<<>> దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ నింపింది. ఉదయం నుంచి క్లోజింగ్ వరకు బుల్ జోరు కొనసాగింది. సెన్సెక్స్ 2,946 పాయింట్లు ఎగిసి 77,562 వద్ద, నిఫ్టీ 873 పాయింట్లు వృద్ధి చెంది 23,997 వద్ద ముగిశాయి. దీంతో ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.16.59 లక్షల కోట్ల సంపద ఆర్జించారు. క్రూడాయిల్ ధర తగ్గడం, రెపోరేట్‌ను RBI యథాతథంగా ఉంచడం కూడా మార్కెట్లకు ప్లస్ అయింది.