News January 24, 2026

​ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డు.. రూ.23 వేల కోట్ల ఆదాయం

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23,000 కోట్ల సరుకు రవాణా ఆదాయాన్ని కేవలం 294 రోజుల్లోనే సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 27 రోజులు ముందే కావడం విశేషం. మొత్తం ఆదాయంలో 11.21%, సరుకు రవాణాలో 11.31% వృద్ధిని నమోదు చేస్తూ, భారతీయ రైల్వేలోనే నంబర్ వన్ జోన్‌గా నిలిచింది. ఈ వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారికంగా వెల్లడించింది.

Similar News

News February 10, 2026

పోర్టును సందర్శించిన ఐఏఎస్ ట్రైనీ అధికారుల బృందం

image

వింటర్ స్టడీ టూర్‌లో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ట్రైనీ అధికారుల బృందం సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీను సందర్శించింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన నిర్వహించారు. పోర్ట్ సామర్థ్యాలు, పూర్తి యాంత్రీకరణ దిశగా తీసుకుంటున్న చర్యలు, ఆధునీకరణపై వివరణ ఇచ్చారు. 10 మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్, పరిశ్రమల వినియోగానికి నీటిని మళ్లీ ఉపయోగించే మలిన జల వినియోగంపై వివరించారు.

News February 9, 2026

తీరు మారకపోతే కఠిన చర్యలు: విశాఖ కలెక్టర్

image

కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన PGRSలో భాగంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడారు. 25 శాతం కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న అధికారులకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా వినతుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తున్న టీపీవో-6కి ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ పనితీరును నెల రోజులు సూక్ష్మంగా పరిశీలిస్తానని, తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 8, 2026

విశాఖ: కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

image

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.