News January 24, 2026
అలర్ట్.. 149 మిలియన్ల పాస్‌వర్డ్‌లు లీక్

ప్రపంచ వ్యాప్తంగా 149M(దాదాపు 15కోట్లు) యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఇందులో Gmail, FB, ఇన్‌స్టా, నెట్‌ఫ్లిక్స్, బ్యాంకింగ్, క్రిప్టో అకౌంట్ల వివరాలు ఉన్నాయి. ఇన్‌ఫోస్టీలర్ మాల్‌వేర్ ద్వారా ఈ సమాచారం చోరీ అయినట్లు తెలుస్తోంది. వినియోగదారులు పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని, ప్రతి అకౌంట్‌కు వేర్వేరుగా స్ట్రాంగ్‌గా ఉండేవి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News January 26, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఎంతంటే?

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ నిన్నటి వరకు రూ.350 కోట్ల(గ్రాస్)కు పైగా వసూలు చేసింది. నిన్న జరిగిన ఈవెంట్‌లో మేకర్స్ స్పెషల్ పోస్టర్ వేశారు. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్ స్పెషల్ రోల్ చేశారు.
News January 26, 2026
NZతో చివరి 2 T20లకు తిలక్ దూరం

గాయంతో NZతో జరిగిన తొలి 3 T20లకు దూరమైన తిలక్ చివరి 2 మ్యాచులూ ఆడట్లేదని BCCI తెలిపింది. అతని స్థానంలో శ్రేయస్ జట్టులో కంటిన్యూ అవుతారని వివరించింది. అయితే వచ్చే నెల ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ నాటికి తిలక్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నం.3లో ఇషాన్ ఆడుతుండగా, తిలక్ జట్టులో జాయిన్ అయితే ఆ స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది.
News January 26, 2026
నేషనల్ అథారిటీ కాంపాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ కాంపెన్సేటరీ అపారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(నేషనల్ అథారిటీ కాంపా) 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో పీజీ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://moef.gov.in/


