News January 24, 2026

BIG BREAKING: నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్.. ఇటు వెళ్లకండి!

image

నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని CP సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఇప్పటికే అబిడ్స్-నాంపల్లి మార్గంలో వాహనాల కదలిక మందగించింది. అబిడ్స్ నుంచి ఎంజే మార్కెట్ మార్గంలో వాహనాలను మళ్లించినా.. పరిస్థితి అదుపులోకి తేవడం కష్టతరమవుతోంది.

Similar News

News February 21, 2026

HYDలో నేడే మెగా సెమినార్.. పేరెంట్స్ మీకోసమే!

image

10th తర్వాత విద్యార్థులు ఏ రూట్‌లో వెళితే ఫ్యూచర్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత కెరీర్ గైడెన్స్ సెమినార్లు నిర్వహిస్తున్నాయి. శ్రీనగర్‌కాలనీలోని శ్రీ సత్య సాయి నిగామగమం ట్రస్ట్‌లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు సదస్సు జరగనుంది. CBI Ex జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. సో పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

News February 21, 2026

దిల్‍సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు 13 ఏళ్లు

image

దిల్‍సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి 13 ఏళ్లు. 2013 FEB 21న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. కేసులో NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులకు పడిన శిక్షలు త్వరగా అమలు చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

News February 21, 2026

HYD: మహిళ భద్రత విభాగానికి రూ.50లక్షల విరాళం

image

తెలంగాణలో మహిళల రక్షణ, భద్రతకు బలమైన తోడ్పాటు లభించింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల విరాళాన్ని అందజేస్తూ పోలీసుశాఖ మహిళా భద్రతా విభాగానికి మద్దతు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసు శాఖలోని మహిళల భద్రతకు వినియోగించాలని ఆమె కోరారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ విరాళాన్ని స్వీకరించి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన దాతలను అభినందించారు.