News January 24, 2026

మీడియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ

image

అదానీ గ్రూప్ మీడియా రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్‌ (Indo Asian News Service)లో మిగిలిన 24% వాటాను కొనుగోలు చేసింది. దీంతో IANS పూర్తిగా అదానీ గ్రూప్ సంస్థగా మారింది. ఇప్పటికే 2023 డిసెంబరులో 50.5% ఉన్న వాటాను 2024 జనవరిలో 76 శాతానికి పెంచుకున్నారు. NDTV, బీక్యూ ప్రైమ్ తర్వాత ఐఏఎన్‌ఎస్‌ కూడా చేతికి రావడంతో మీడియాలో అదానీ ప్రభావం మరింత పెరగనుంది.

Similar News

News February 12, 2026

రష్యాలో వాట్సాప్‌పై నిషేధం.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు!

image

వాట్సాప్‌ను బ్యాన్ చేసినట్లు రష్యా ధ్రువీకరించింది. తమ చట్టాలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. 100 మిలియన్ల యూజర్లను స్వదేశీ మెసెంజర్ యాప్ ‘MAX’కు మారాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే మ్యాక్స్ సర్వైలెన్స్(నిఘా) యాప్ అని ఆరోపణలు రాగా వాటిని అధికారులు ఖండించారు. ‘టెలిగ్రామ్‌’పైనా దశలవారీగా ఆంక్షలు విధించే యోచనలో రష్యా ఉన్నట్లు సమాచారం.

News February 12, 2026

11 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన భారత్

image

నమీబియాతో మ్యాచులో మరింత స్కోర్ చేయాల్సిన IND 209రన్స్‌కే పరిమితమైంది. ఒక దశలో 250 దాటుతుందని భావించినా ఇన్నింగ్స్ చివరి 11బంతుల్లో 5వికెట్లు కోల్పోవడంతో స్కోర్ పడిపోయింది. ఊపు మీదున్న పాండ్య 19వ ఓవర్‌ రెండో బాల్‌కు ఔట్ కాగా తర్వాతి బంతికి దూబే రనౌట్ అయ్యారు. అదే ఓవర్ చివరి బాల్‌కు అక్షర్ బౌల్డ్ అయ్యారు. 20వ ఓవర్ మూడో బంతికి రింకూ, చివరి బాల్‌కు అర్ష్‌దీప్ ఔటయ్యారు. 11 బాల్స్‌లో 4 రన్సే వచ్చాయి.

News February 12, 2026

T20 WC: భారత్ భారీ స్కోర్

image

నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209/9 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ (52) రాణించారు. దూబే 23, శాంసన్ 22, తిలక్ 25, సూర్య 12 పరుగులు చేశారు. 19వ ఓవర్లో భారత్ 3 వికెట్లు(పాండ్య, దూబే, అక్షర్) కోల్పోవడంతో స్కోర్ కాస్త తగ్గింది.