News January 24, 2026

సిరిసిల్ల: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

image

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం నిర్వహించారు. ఈ మేరకు ఇంఛార్జ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్లెక్సిపై బాలికలను ఉద్దేశించి స్కై ఇస్ ద లిమిట్ అని రాశారు.

Similar News

News March 9, 2026

అప్పటిదాకా పెట్రోల్ రేట్లు పెరగవు: ప్రభుత్వ వర్గాలు

image

దేశంలో అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని, ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘క్రూడాయిల్ ధరలు 130 డాలర్లకు(ఒక బ్యారెల్‌కు) చేరే దాకా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. చమురు రేటు బ్యారెల్‌కు 100 డాలర్లుగా స్టెబిలైజ్ అవుతుంది. దేశంలో ఏ పెట్రోల్ పంపులోనూ కొరత లేదు. వివిధ మార్గాల ద్వారా క్రూడ్ సేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది’ అని వివరించాయి.

News March 9, 2026

టీయూలో జాతీయ సదస్సు:IMC-2026 బ్రోచర్ ఆవిష్కరణ

image

తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్స్ ఇన్ మెడికల్ కెమిస్ట్రీ(IMC-2026)” అనే అంశంపై జాతీయ సదస్సును ఈ నెల 25,26 తేదీలలో నిర్వహించనున్నట్లు HOD డా.సాయిలు తెలిపారు. జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, రిజిస్టార్ ఆచార్య యాదగిరి ఆవిష్కరించారు. ఈ సదస్సుకు దేశం నుంచి ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు నూతన ఆవిష్కరణల గురించి చర్చిస్తారన్నారు.

News March 9, 2026

నెయ్యికి కొరత లేదు: టీటీడీ

image

తిరుమల లడ్డూల తయారీలో వాడే నెయ్యికి కొరత లేదని TTD తెలిపింది. మూడంచెల కొనుగోలు విధానం ద్వారా ఆవు నెయ్యి సరఫరా అవుతోందని వెల్లడించింది. ఈ విషయంలో అసత్య ప్రచారాలు నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం 7 లక్షలకు పైగా లడ్డూలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడంతో క్లారిటీ ఇచ్చింది.