News January 24, 2026
నాంపల్లి అగ్నిప్రమాదం: ప్రాణాలకు తెగించి వెళ్లినా.. తిరిగిరాని ముగ్గురు!

నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. లోపల ఉన్న వారిని కాపాడేందుకు మేనేజర్ మహమ్మద్ హుస్సేన్, ఇంతియాజ్‌తో పాటు మరొక వ్యక్తి సాహసించి లోపలికి వెళ్లారు. దురదృష్టవశాత్తు వారు తిరిగి రాలేదు. బాధితుల్లో 60 ఏళ్ల వృద్ధురాలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ, మంటల మధ్య వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
Similar News
News February 2, 2026
ఖమ్మం: మిరప తోటలో ప్రేమ.. కూలీలకు పెళ్లి చేసిన రైతు!

నేలకొండపల్లి(M) ముటాపురం బిల్యాతండాలో ఒక రైతు తన ఉదారతతో మానవత్వాన్ని చాటుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి మిరప కోతకు వచ్చిన కూలీలు పూల్‌సింగ్, ఆశాలు ప్రేమలో పడ్డారు. విషయాన్ని తెలుసుకున్న రైతు భూక్యా మోహన్‌రావు.. వారిని ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో వీరన్న స్వామి సన్నిధిలో వివాహం జరిపించి, ఆశీర్వదించారు. కూలీల పట్ల రైతు చూపిన ప్రేమను స్థానికులు అభినందించారు.
News February 2, 2026
జిల్లాలో ఈ-పంట నమోదు నూరుశాతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఈ-పంట నమోదు నూరుశాతం పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయాధికారులు ఆదేశించారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో సోమవారం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రైతులకు ఎరువుల పంపిణీ, సబ్సిడీపై విత్తనాలు, పంట రుణాలు, పంట నష్ట పరిహారం అందించేందుకు, ధాన్యం సేకరణ, తదితర అంశాలలో ఈ-పంట నమోదై ఉండాలన్నారు.
News February 2, 2026
KGBVల్లో ఖాళీల భర్తీ పరిస్థితి ఏంటి: వేమిరెడ్డి

రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివరించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. సోమవారం లోక్ సభలో కేజీబీవీలపై ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో 587 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలకు గాను 487 మాత్రమే పని చేస్తున్నాయని, ఇది నిజమేనా అని ఆయన ఆరా తీశారు.


