News January 24, 2026
దుబ్బాకలో తల్లి మృతి తట్టుకోలేక కొడుకు సూసైడ్

దుబ్బాక పట్టణంలో ఎండీ అజారుద్దీన్ (28) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలల క్రితం తల్లి మహబూబ్ బీ చెరువులో దూకి మృతి చెందడంతో అప్పటి నుంచి అజారుద్దీన్ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన అతడు గురువారం అర్ధరాత్రి తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై కీర్తిరాజు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 11, 2026
తణుకు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో మృతి

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీర వెంకట సత్య తాతారావు (56) గుండెపోటుతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన ఆయన ఆరోగ్యం బాగాలేదని ఈసీజీ తీయించుకొని కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది. దీంతో తాతారావును తణుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News February 11, 2026
కాకినాడ: రబీ సీజన్‌కు సరిపడా ఎరువులు సిద్ధం- జేడీ

రబీ సీజన్‌కు సరిపడే స్థాయిలో యూరియా సహా అన్ని ఎరువులు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు. ఈ నెల అవసరాలకు తగ్గట్టుగా ఇప్పటికే 27,141 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, మరో 3,967 టన్నులు సిద్ధంగా ఉందన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నామని, ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
News February 11, 2026
1pm వరకు 48.54% పోలింగ్

TG: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 51.66%, కార్పొరేషన్లలో 40.96% ఓటింగ్ నమోదైంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవమని, నల్గొండ, కరీంనగర్‌లో జరిగినవి చిన్న గొడవలే అని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు.


