News April 27, 2024
మందమర్రి: కుటుంబ కలహాలతో సింగరేణి కార్మికుడి ఆత్మహత్య
మందమర్రి ప్రాణహిత కాలనీలో మేడ మహేష్(55) అనే సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మద్యానికి బానిసైన మహేష్ కూర విషయంలో భార్య, కొడుకుతో శుక్రవారం గొడవ పడ్డాడు. దీంతో ఇంటి బయట కుటుంబ సభ్యులు ఉండగా గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహ్యత్య చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని సీఐ శశిధర్రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News January 10, 2025
బజార్హత్నూర్: ముగ్గురి మృతికి కారణమైన ఆటో డ్రైవర్ అరెస్ట్
అతిగా మద్యం తాగి ఆటో నడిపి ముగ్గురి మృతికి కారణమైన ఆటో డ్రైవర్ పాలెపు రాకేష్ ను గురువారం అరెస్టు చేసినట్లు బోథ్ సీఐ వెంకటేశ్వర రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 7న రాకేష్ అతిగా మద్యం తాగి, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ఆటోను అజాగ్రత్తగా నడపడంతో బజార్హత్నూర్ మండలం దేగామ శివారులో ఆటో బోల్తా పడిందని, ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, గాయపడిన వారు చికిత్స పొందుతున్నారన్నారు.
News January 10, 2025
కలెక్టర్ చేతుల మీదుగా ట్రెసా క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)-2025 క్యాలెండర్ ను గురువారం సాయంత్రం 4గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2025
MNCL: ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన కలెక్టర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సులేమాన్‌తో కలిసి కళాశాలలోని వివిధ విభాగాలు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామన్నారు.