News April 27, 2024
NZB: అప్పుడు కలెక్టర్లు.. ఇప్పుడు MLA అభ్యర్థులు

నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా పని చేసి పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. 2007 నుంచి 2009 వరకు కలెక్టర గా పనిచేసిన బి. రామాంజనేయులు..ఇప్పుడు ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2010 నుంచి 2012 వరకు కలెక్టర్‌గా పనిచేసిన డి.వరప్రసాద్..రాజోలు నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. మరీ వారికి విజయం వరిస్తుందో లేదో చూడాలి
Similar News
News September 12, 2025
ఈనెల 10 నుంచి రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచి 17 వరకు పోరాట విశిష్టతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహించాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేపట్టాలని కోరారు.
News September 11, 2025
NZB: కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తే క్రిమినల్ కేసులు

నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో, ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలులేదని రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు. ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఉన్న నిజామాబాద్ ఏసీపీ అనుమతితో ధర్నాచౌక్, ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంతంలో చేసుకోవాలన్నారు. ఎవరైనా IDOC ఎదుట నిరసన కార్యక్రమాలు జరిపితే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News September 11, 2025
NZB: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేటలోని సిరన్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. లబ్దిదారులను కలిసి, ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గ్రామంలో 93 ఇళ్లు మంజూరు కాగా, 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇళ్లు స్లాబ్ పూర్తి అయినట్లు చెప్పారు.