News January 25, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలు.. BRS ఇన్‌ఛార్జిలు వీరే..!

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అధిష్టానం ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఏదులాపురం – ఎమ్మెల్సీ తాతా మధు, మధిర – మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును నియమించారు. అలాగే వైరా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి – కె.నాగభూషణం వ్యవహరించనున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో నేతలను సమన్వయం చేస్తూ పార్టీ గెలుపునకు కృషి చేయనున్నారు.
Similar News
News February 4, 2026
ఖమ్మం జిల్లాకు 1,517 టన్నుల యూరియా

ఖమ్మం జిల్లా రైతుల కోసం ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 1,517.16 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు చేరుకుంది. ఏఓ పవన్‌కుమార్ పర్యవేక్షణలో ఈ నిల్వలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. సాగు అవసరాలకు తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సరఫరాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
News February 4, 2026
విద్యా పరిపాలనపై శిక్షణ.. గుజరాత్‌కు ఖమ్మం డీఈఓ!

ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) చైతన్య జైనీ వృత్తిపరమైన శిక్షణ కోసం గుజరాత్ వెళ్లారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు విద్యా నిర్వహణ, ఆధునిక విధానాలపై జరిగే ప్రత్యేక తరగతుల్లో ఆమె పాల్గొంటారు. ఆమె గైర్హాజరీలో డీఈఓ కార్యాలయ ఏడీ చావా శ్రీనివాసరావు ఇన్‌ఛార్జ్ డీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారని అధికారులు తెలిపారు. విద్యా రంగంలో సంస్కరణలే లక్ష్యంగా ఈ శిక్షణ సాగనుంది.
News February 4, 2026
ఖమ్మం: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

ఖమ్మం జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ముగిశాయి. 3.30లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను, ఏకంగా 3.67లక్షల టన్నులు సేకరించినట్లు డీఎస్ఓ చందనకుమార్ తెలిపారు. రైతులకు రూ. 877.98 కోట్లు చెల్లించారు. సన్నబియ్యం బోనస్ కింద 39,476 మందికి రూ. 113.57 కోట్లు జమ చేశామని, మిగిలిన వారికి త్వరలోనే చెల్లింపులు పూర్తి చేస్తామని వెల్లడించారు.


