News January 25, 2026

ఖమ్మం: వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పోటీకి సై..!

image

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి సాగేందుకు సీపీఐ పావులు కదుపుతోంది. వైరా(2), మధిర(3), ఇల్లందు(3), అశ్వారావుపేట(3), సత్తుపల్లి(1) వార్డుల్లో పోటీ చేసేందుకు సిద్ధమని వామపక్ష నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూలంగా స్పందిస్తే.. ఉమ్మడి జిల్లాలో ‘హస్తం-ఎర్రజెండా’ పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంది.

Similar News

News April 4, 2026

కామారెడ్డి: గిరిజన యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ

image

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గిరిజన యువతకు కేరళంలోని కోచ్చిలో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇండస్ట్రియల్ ఎలక్ట్రిషియన్, వెల్డర్ వంటి కోర్సుల్లో ITI, డిప్లొమా పూర్తి చేసిన TG గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు APR 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ తెలిపారు.

News April 4, 2026

నేవీ అమ్ములపొదిలోకి ‘అరిదమన్’

image

భారతీయ నౌకాదళంలోకి స్వదేశీ సాంకేతికతతో తయారైన అణు జలాంతర్గామి ‘అరిదమన్’ చేరింది. దీంతో నేవీ అమ్ములపొదిలోని న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ల సంఖ్య మూడుకు పెరిగింది. ఇది INS అరిఘాట్, INS అరిహంత్‌తో పోలిస్తే అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ జలాంతర్గామి 3,500 కిలోమీటర్ల రేంజ్‌‌కు వెళ్లే అణుసామర్థ్యం గల ఎనిమిది కే-4 మిసైళ్లను మోయగలదు. దీంతో పాటు 24 K-15 సాగరిక న్యూక్లియర్ మిసైల్స్‌ను కూడా మోసే సామర్థ్యం ఉంది.

News April 4, 2026

ఓడామని వదలొద్దు.. ప్రయత్నిస్తే విజయం తథ్యం

image

అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: సంగీతం రానివారైనా రాగాలను పదేపదే ఆలపిస్తూ ఉంటే కొన్నాళ్లకు వినసొంపుగా పాడగలుగుతారు. వేప ఆకులు చేదుగా ఉన్నా రోజూ తింటూ ఉంటే కొన్నాళ్లకు తియ్యగా అనిపిస్తాయి. ఏ రంగమైనా సాధనతో నైపుణ్యం పెరిగి రాణిస్తారు. తొలిసారి విఫలమైనా తుదకు విజయం సాధిస్తారు.