News April 27, 2024
పెన్షన్ రూ.3,500కు పెంచుతాం: జగన్
AP: వైఎస్సార్ పెన్షన్ కానుకను రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతామని జగన్ ప్రకటించారు. జనవరి 1, 2028న రూ.250, జనవరి 1, 2029న మరో రూ.250 పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం పెన్షన్ నెలకు రూ.3,000 వస్తోందని, 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని జగన్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తామే ఎక్కువ మందికి, ఎక్కువ మొత్తం ఇస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News January 3, 2025
రోహిత్ రెస్ట్ తీసుకుంటున్నారా? తప్పించారా?
BGT 5వ టెస్టులో రోహిత్‌కు బదులు బుమ్రా టాస్‌కు రావడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. నిన్న IND జట్టులో మార్పులుంటాయని, రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ఊహాగానాలొచ్చిన విషయం తెలిసిందే. వాటిని నిజం చేస్తూ రోహిత్ జట్టులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుమ్రా చెప్పినట్లు హిట్ మ్యాన్ తాను ‘ఆడను, రెస్ట్ తీసుకుంటా’ అని చెప్పారా? కావాలనే జట్టు నుంచి తప్పించారా? అనే అంశం చర్చనీయాంశమైంది.
News January 3, 2025
ఇవాళ అకౌంట్లోకి డబ్బులు: ప్రభుత్వం
TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని చెప్పింది. సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. పలువురి ఖాతాల్లో గురువారం రాత్రి జమ కాగా, మిగతా వారికి ఇవాళ డబ్బులు పడనున్నాయి. కాగా జనవరి 1న సెలవు కావడంతో జీతాలు జమ కాలేదనే ప్రచారం జరిగింది.
News January 3, 2025
చర్లపల్లి రైల్వే టెర్మినల్ 6న ప్రారంభం
TG: చర్లపల్లిలో రూ.430 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. గత నెల 28నే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మాజీ పీఎం మన్మోహన్ మృతి కారణంగా వాయిదా పడింది. సికింద్రాబాద్ స్టేషన్‌పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు.