News April 27, 2024
ఇండిపెండెంట్లతో ఈజీ కాదు!

AP: ప్రతి ఎన్నికల్లో ప్రధాన పార్టీలపైనే ప్రజల ఫోకస్ ఉంటుంది. ఇండిపెండెంట్లను అంత సీరియస్‌గా తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ గత ఎన్నికల సరళిని చూస్తే స్వతంత్రుల జోరు బాగానే ఉందని చెప్పక తప్పదు. వీరు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తున్నారు. 2014లో స్వతంత్రులకు 5,14,129 ఓట్లు పడగా ఇద్దరు(పిఠాపురం-SVSN వర్మ, చీరాల- ఆమంచి కృష్ణమోహన్) గెలిచారు. 2019లో వీరికి 2,86,859 ఓట్లు పడ్డాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 3, 2025
ఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇంతకుముందు కర్నూలులో 20, రాజస్థాన్‌లో 15, బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
News November 3, 2025
వేగం వద్దు బ్రదర్.. DRIVE SAFE

వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించదు. ఈ సమయంలో అతివేగం అత్యంత ప్రమాదకరం. ‘కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు.. మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవడమే ముఖ్యం’ అని వారు సూచిస్తున్నారు. డ్రైవర్లు నిర్ణీత వేగ పరిమితి పాటించాలని, సురక్షిత దూరాన్ని కొనసాగించాలని అవగాహన కల్పిస్తున్నారు.
News November 3, 2025
మీర్జాగూడ ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

TG: మీర్జాగూడ<<18183462>> ప్రమాదంలో<<>> మృతులంతా చేవెళ్ల వాసులేనని తెలుస్తోంది. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ నం: 9912919545, 9440854433.


