News January 25, 2026
హైదరాబాద్‌లో హలో.. హలో..!

‘హలో.. హలో.. ఏంటి కాల్ జంప్ అవుతోంది’ ఇదే నగరవాసుల నోటి వెంట వినపడేది. ఇంట్లోనుంచి బయటికి వెళ్తేనే ఫోన్ సిగ్నల్ వస్తుందని Jio, Airtel యూజర్స్ చెబుతున్నమాట. నిన్నో వ్యక్తి RTO ఆఫీస్‌కెళ్తే సిగ్నల్ లేక అక్కడ జనాలంతా పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీకాదంటున్నారు. అక్కడికి వచ్చినవారంతా హలో అని అరుస్తూనే ఉన్నారట. ఇక శివారులో ఇంట్లో ఉంటే కనీసం వాట్సాప్ స్టేటస్ ప్లే కావడంలేదని వాపోతున్నారు. మీకూ సేమ్ ఇష్యూ ఉందా?
Similar News
News January 27, 2026
HYD: ‘వాడి టార్గెట్ GYM చేసే యువకులే’

జిం చేసే యువతకు అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న మొహమ్మద్ ఫైజల్ ఖాన్‌ను వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సూరత్ నుంచి వీటిని తెప్పించి ప్రిస్క్రిప్షన్ లేకుండా అత్తాపూర్ పరిసరాల్లో విక్రయిస్తున్నాడు. అతడి నుంచి భారీగా ఇంజెక్షన్లు, సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్లు వాడితే కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయని డాక్టర్లు చెబుతున్నారు.
News January 26, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ అధికారులు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. సిట్ విచారణకు సహకరించాలన్నారు.
News January 26, 2026
గోల్కొండ, చార్మినార్ కట్టడాలకు TOP 10లో చోటు

గోల్కొండ, చార్మినార్ కట్టడాలు భాగ్యనగర పేరును ప్రపంచవ్యాప్తం చేశాయి. వాటి అందాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది వస్తుంటారు. దేశంలోని చారిత్రక ప్రాంతాలను చూసేందుకు వచ్చేవారు ఈ రెండింటిని చూడకుండా వెళ్లరు. అందుకే టాప్ 10 ప్రదేశాల్లో గోల్కొండ, చార్మినార్ చోటు సంపాదించుకున్నాయి. గోల్కొండ కోట 6వ స్థానం, చార్మినార్ 10వ స్థానంలో ఉన్నాయి.


