News April 27, 2024
MBNR: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటిద్దాం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు దంచి కొడుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున వృద్ధులు చిన్నారులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* తెలుపు రంగు గల కాటన్ దుస్తులను ధరించండి
* అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రండి
* కళ్లకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ను వాడండి
* దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగండి
* వీలైనంతవరకు ఇంట్లో ఉండండి.
Similar News
News December 28, 2024
MBNR: మన్మోహన్ సింగ్‌కు ఎమ్మెల్యేల నివాళులు
భారత మాజీప్రధాని మన్మోహన్ సింగ్‌కు శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఘన నివాళులర్పించారు. MBNRలోని మూఢ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మూడ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
News December 28, 2024
రాష్ట్ర స్థాయికి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు
హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ హాకీ టోర్నమెంట్లో రెండో రోజు మహబూబ్‌నగర్ జిల్లా హాకీ జట్టు సెమీఫైనల్‌కి చేరింది. రెండవ రోజు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా జట్లతో క్రీడాకారులు అత్యున్నత మైన ప్రదర్శన కనబరిచి విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కి అర్హత సాధించారు. రేపు నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల జట్లు సెమీఫైనల్లో పోటీ పడతాయని నిర్వాహకులు తెలిపారు.
News December 28, 2024
నేటి నుంచి APGVB సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్ గ్రామీ వికాస్ బ్యాంక్(APGVB) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం కానుంది. 2025 JAN1 నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవల (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP) తాత్కాలికంగా అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని పాలమూరు జిల్లా బ్యాంకు అధికారులు కోరారు. ఈ బ్యాంకుకు ఉమ్మడి పాలమూరులో 85 బ్రాంచ్‌లు ఉన్నాయి.