News January 25, 2026

చరిత్ర, ప్రకృతి, ప్రగతిల సమాహారం.. మన పెద్దపల్లి!

image

పెద్దపల్లి జిల్లా అరుదైన చారిత్రక, భౌగోళిక విశిష్టతలకు నిలయం. 12వ శతాబ్దంలో కాకతీయుల రెండో రాజధానిగా వెలిగిన రామగిరి ఖిల్లా, ప్రాచీన ధూళికట్ట బౌద్ధ స్థూపం ఇక్కడ జిల్లా ఘనతను చాటుతున్నాయి. గోదావరి, మానేరు నదుల కలయికతో పాటు, రాజధాని దాహార్తిని తీర్చే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇక్కడే ఉంది. అటు ఎన్టీపీసీ వెలుగులు, ఇటు సింగరేణి నల్లబంగారంతో ఈ జిల్లా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది.

Similar News

News February 20, 2026

వచ్చే నెల కార్పొరేట్ అమెండ్‌మెంట్ బిల్?

image

మార్చి 9న ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సెషన్‌లో కేంద్రం కార్పొరేట్ అమెండ్‌మెంట్ బిల్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కంపెనీస్ యాక్ట్ (2013), LLP ACT (2008) చట్టాల్లోని రూల్స్‌ను ఈ బిల్లుతో సవరించనుంది. సాంకేతికంగా లేదా కార్యకలాపాల్లో జరిగే చిన్న పొరపాట్లపై ఉన్న క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను తొలగించనుంది. డిజిటైజేషన్‌ ద్వారా పర్యవేక్షణ మెరుగవుతుంది. దీంతో వ్యాపార కార్యకలాపాలు సులభతరం కానున్నాయి.

News February 20, 2026

విజయవాడలో దారుణం.. కూతురి పట్ల తండ్రి అసభ్య ప్రవర్తన

image

విజయవాడ YSR కాలనీలో దారుణం వెలుగు చూసింది. మద్యం మత్తుకు బానిసైన ఓ తండ్రి తన 13 ఏళ్ల కుమార్తెపైనే అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి వదిలి వెళ్లిపోవడంతో తండ్రి వద్దే ఉంటున్న ఆ బాలికకు ఈ వేధింపులు నరకంగా మారాయి. బాధితురాలు తన స్కూల్ టీచర్‌కు ఈ విషయాన్ని తెలపడంతో, టీచర్ చైల్డ్ లైన్ సహాయంతో కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలకు సిద్ధమయ్యారు.

News February 20, 2026

పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం తగ్గిన బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,57,370కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 ఎగబాకి రూ.1,44,250 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.