News January 25, 2026

BNGR: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

image

దిలావర్‌పూర్‌లో ఉదయం విషాదం నెలకొంది. గీత వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి పండరి గౌడ్ (53) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. పండరి గౌడ్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని మోకుదెబ్బ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

Similar News

News February 27, 2026

డయేరియా ప్రాంతంలో రాష్ట్ర వైద్యఆరోగ్య కమిషనర్ పర్యటన

image

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ శుక్రవారం పర్యటించారు. దమ్మలవీధిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వ్యాధికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తగిన సమయంలో వైద్యం అందించారా లేదా అని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనితను ప్రశ్నించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫార్మాన్ ఖాన్ ఉన్నారు.

News February 27, 2026

MNCL: బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ వాయిదా

image

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను మంచిర్యాల జిల్లా కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. శుక్రవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్, సుమన్ తరఫు న్యాయవాదుల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తుది నిర్ణయాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం సుమన్ ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారం జరగనుంది.

News February 27, 2026

రూ.151కే భద్రాచలం రాములోరి తలంబ్రాలు

image

శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచల సీతారామచంద్రస్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ముంగిటకే చేర్చేందుకు
TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఖమ్మం ఆర్ఎం శ్రీరామ్ ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. మార్చి 27న భద్రాద్రిలో జరిగే కల్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల కోసం రూ.151కే తలంబ్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు tgsrtclogistics.gov.in లో బుక్ చేసుకోవాలన్నారు.