News January 25, 2026
HYD: ఓపెన్‌లో PG, డిప్లొమా చేయాలనుకుంటున్నారా?

ఈ ఎడాదికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో ఓపెన్ పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌లకు సంబంధించిన వివిధ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య పద్మప్రియ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు sprtu.softelsolutions.in, www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో మార్చి 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు 73306 23411 ఫోన్ చేయాలన్నారు.
Similar News
News February 2, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, పరీక్షల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా పనులు పూర్తి చేయాలన్నారు.
News February 1, 2026
రంగారెడ్డి: నూతన సర్పంచుల శిక్షణా షెడ్యూల్‌లో మార్పులు

ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణా తరగతుల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మున్సిపాల్ ఎన్నికల కారణంగా కొత్త షెడ్యూల్ విడుదలైంది. మూడో విడత శిక్షణ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు, నాల్గో విడత ట్రైనింగ్ మార్చి 2 నుంచి 7 వరకు, ఐదో విడత శిక్షణ మార్చి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. అప్పటివరకు సర్పంచులు గ్రామాభివృద్ధి పనుల్లో నిమగ్నం కావాలన్నారు.
News February 1, 2026
GHMC: రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం

2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ను కౌన్సిల్‌లో జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది. GHMC మొత్తం బడ్జెట్ రూ.11,460 కోట్లుగా పేర్కొంది. ఆదాయం రూ.6,441 కోట్లు, జీహెచ్ఎంసీ ఖర్చు రూ.4,057 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2,384 కోట్లు, రెవెన్యూ గ్రాంట్స్ రూ.400 కోట్లు, కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల కోసం రూ.2,260 కోట్లను కేటాయించింది. విలీనమైన 27 మున్సిపాలిటీల నుంచి వచ్చిన రెవెన్యూ రూ.1,860 కోట్లుగా పేర్కొంది.


