News April 27, 2024
30న టంగుటూరు రానున్న సీఎం జగన్

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు టంగుటూరులో జరగనున్నట్లు రాష్ట్ర మంత్రి, కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. వైసీపీ శ్రేణులు ముందుగా కొండపిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని షెడ్యూలు విడుదల చేశారు. అయితే సీఎం పర్యటనకు, జన సమీకరణకు టంగుటూరు అనుకూలంగా ఉంటుందని భావించి మార్చినట్లు మంత్రి సురేశ్ తెలియచేశారు.
Similar News
News January 21, 2026
23న వెలిగొండకు మంత్రి నిమ్మల.. నెలాఖరుకు CM

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చూసేందుకు వెళ్తున్నారు.
News January 21, 2026
ప్రకాశం: గీతిక.. నువ్వు సూపర్!

ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెం పాఠశాల విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. హెచ్ఎం మంచికల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 10వ తరగతి చదువుతున్న గీతిక 8వ తరగతిలో రాసిన కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని ‘వేదన’ పేరిట ప్రచురించారు. రచనవి భాగంలో పాఠశాల గ్రంథాలయాలకు దీపిక రాసిన పుస్తకం ఎంపికైనట్లు HM చెప్పారు.