News January 25, 2026
T20 WC పాక్ జట్టు ప్రకటన

T20 WCలో పాల్గొనడంపై అనుమానం వ్యక్తం చేస్తూ PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నిన్న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు పాక్ జట్టును ప్రకటించింది.
టీమ్: సల్మాన్ అలీ అఘా (C), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మొహమ్మద్ నఫే (WK), మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (WK), సైమ్ అయూబ్, షాహీన్ అఫ్రీది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్
Similar News
News February 18, 2026
వినియోగదారులకు అండగా NCH.. ఫిర్యాదు చేస్తే చాలు!

మీరు కొన్న వస్తువు నచ్చకపోయినా లేదా డబ్బులు తిరిగి రాకపోయినా ఇక ఆందోళన వద్దు. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్-1915 (NCH) గత 9 నెలల్లో 79,521 ఫిర్యాదులను పరిష్కరించి, వినియోగదారులకు ఏకంగా ₹52 కోట్లు రిఫండ్ ఇప్పించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ (ఈ-కామర్స్) మోసాలపై వచ్చిన 47,743 ఫిర్యాదులను పరిష్కరించింది. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా డిజిటల్ పద్ధతిలోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
News February 18, 2026
మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

AP: ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతిలో MBU వద్ద విద్యార్థి నాయకుల <<19041650>>కిడ్నాప్ కేసులో<<>> అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.
News February 18, 2026
వెంటిలేటర్‌పై సల్మాన్ ఖాన్ తండ్రి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.


