News April 27, 2024
ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయాలి: కూటమి నేతలు

AP: పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎస్ జవహర్‌రెడ్డిని కోరారు. సచివాలయంలో సీఎస్‌ను కలిసిన కూటమి నేతలు.. ‘మే నెల పెన్షన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని కోరాం. వచ్చే నెల పెన్షన్ పంపిణీలో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడాలి. ప్రభుత్వ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అమలు చేయకపోవడం ఏంటి?’ అని ప్రశ్నించారు.
Similar News
News January 3, 2026
పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.
News January 3, 2026
ఇతిహాసాలు క్విజ్ – 116

ఈరోజు ప్రశ్న: వాల్మీకీ కన్నా ముందే రామాయణంలో ఒకరు రామాయణాన్ని రాశారు. అది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 3, 2026
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (<


