News January 25, 2026

కొచ్చిన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>కొచ్చిన్<<>> యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్ (నావల్ ఆర్కిటెక్చర్&షిప్ బిల్డింగ్, ఓషియన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్) , MTech, PhD ఉత్తీర్ణులు అర్హులు. PhD హోల్డర్లకు నెలకు రూ.42,000, టీచర్లకు రూ.40,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://recruit.cusat.ac.in

Similar News

News February 10, 2026

గాయిటర్ వ్యాధి చికిత్స

image

థైరాయిడ్‌ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి దాన్ని థైరాయిడ్‌ హార్మోన్లుగా మారుస్తుంది. అయోడిన్‌ లోపిస్తే గాయిటర్‌ జబ్బు వస్తుంది. థైరాయిడ్‌ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా ఎండోక్రైనాలజిస్ట్‌ ఆధ్వర్యంలో తగిన చికిత్స చేస్తారు. థైరాయిడ్‌ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో గాయిటర్‌ తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా గాయిటర్‌ సమస్యను ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు.

News February 10, 2026

టెన్త్ విద్యార్థినితో టీచర్ పెళ్లి.. చివరికి!

image

TG: పాఠాలు నేర్పాల్సిన గురువే విద్యార్థినికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. మేడ్చల్ పోచారం పరిధిలోని ఓ స్కూల్‌లో మైటీన్(27) టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్‌లో టెన్త్ చదువుతున్న బాలికను లోబరుచుకొని పెళ్లి చేసుకున్నాడు. బాలిక మెడలో తాళిని చూసిన కుటుంబ సభ్యులు ఆరాతీయడంతో అసలు విషయం బయటపడింది. వారి ఫిర్యాదుతో టీచర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అతణ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News February 10, 2026

టీ20 WCలో నేటి మ్యాచులు ఇవే

image

T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. చిన్న జట్లు రాణిస్తుండటం పెద్ద టీమ్‌లకు సవాలుగా మారుతోంది. ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11am నుంచి నెదర్లాండ్స్vsనమీబియా (ఢిల్లీ), 3pm నుంచి NZvsUAE (చెన్నై), 7pm నుంచి PAKvsUSA (కొలొంబో) మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. కాగా 2024WCలో పాక్‌పై USA సూపర్ ఓవర్‌లో గెలిచిన నేపథ్యంలో నేటి మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగే అవకాశముంది.