News January 25, 2026
రేపు వైన్ షాపులు బంద్

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద నిర్వాహకులు బోర్డులు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా జనవరి 26న డ్రై డేగా పరిగణిస్తారు. తిరిగి జనవరి 27న షాపులు తెరుచుకోనున్నాయి. కాగా ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎక్సైజ్ శాఖ కఠినచర్యలు తీసుకోనుంది.
Similar News
News February 22, 2026
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.
News February 22, 2026
కర్ణాటకలో పవర్ షేరింగ్‌పై త్వరలో కీలక ప్రకటన!

కర్ణాటకలో CM సిద్దరామయ్య, Dy.CM DK శివకుమార్ మధ్య సాగుతున్న అధికార పోరుకు కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ముగింపు పలకనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సతీశ్ జార్కీహోళీ తెలిపారు. పవర్ షేరింగ్‌పై హైకమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు AICC అధ్యక్షుడు ఖర్గేను కలిసిన అనంతరం ఆయన వెల్లడించారు. సిద్దరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో అధికారాన్ని తనకు అప్పగించాలని శివకుమార్ కోరుతున్న విషయం తెలిసిందే.
News February 22, 2026
చిక్కిపోతున్న చందమామ!

చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నాడని నేషనల్ ఎయిర్&స్పేస్ మ్యూజియానికి చెందిన సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ ప్లానెటరీ స్టడీస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రకంపాల వల్ల ఏర్పడే పగుళ్లే ఇందుకు కారణమని చెబుతున్నారు. చందమామపై పగుళ్ల గురించి శాస్త్రవేత్తలకు 2010 నుంచే తెలిసినా తాజాగా లూనార్ మారియా ప్రాంతాల్లో 1,114 కొత్త పగుళ్లను గుర్తించారు. వీటిని స్మాల్ మేర్ రిడ్జెస్ అని పిలుస్తున్నారు.


