News January 25, 2026

బెస్ట్ ఎలక్టోరల్ అవార్డు అందుకున్న ప్రకాశం కలెక్టర్

image

బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును ప్రకాశం జి్లా కలెక్టర్ రాజాబాబు ఆదివారం అందుకున్నారు. ప్రకాశం జిల్లా తరపున విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా ఉత్తమ అవార్డును జిల్లా కలెక్టర్ రాజాబాబు అందుకోగా పలువురు కలెక్టర్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ప్రకాశం కలెక్టర్‌గా తన పాలన ద్వారా స్పెషల్ మార్క్‌ను కలెక్టర్ చూపారు.

Similar News

News January 30, 2026

నేడు ఒంగోలుకు రానున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

image

అక్రమ మద్యం కేసులో బెయిల్ పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేడు ఒంగోలుకు రానున్నట్లు జిల్లా వైసీపీ కార్యాలయం ప్రకటించింది. నాలుగు గంటలకు జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి ఏం మాట్లాడతారన్న చర్చ జోరుగా సాగుతోంది.

News January 30, 2026

ప్రకాశం: స్వచ్ఛ రథం ఆపరేటర్ల కోసం దరఖాస్తులు

image

ప్రకాశం జిల్లాలో పొడి చెత్త నిర్వహణను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రవేశ పెట్టిన స్వచ్చ రథం ఆపరేటర్ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. మొత్తం 22 మండలాల పరిధిలో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు, ఆపరేటర్లు మూడు సంవత్సరాల స్క్రాప్ నిర్వహణ అనుభవం, ట్రేడ్ లైసెన్స్ సైతం కలిగి ఉండాలని సూచించారు.

News January 30, 2026

ఒంగోలు: బాలికతో అసభ్యం.. 20 ఏళ్ల జైలు శిక్ష.!

image

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు గురువారం తీర్పునిచ్చింది. సింగరాయకొండకు చెందిన హరి అనే వ్యక్తి, ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 2019 జనవరి 14న కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరు పరచగా శిక్ష ఖరారు చేశారు. సంబంధిత పోలీసులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.