News January 25, 2026
నాంపల్లి అగ్నిప్రమాదం.. షాప్ ఓనర్ అరెస్ట్

నాంపల్లిలోని అబిడ్స్ ప్రాంతంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరణించిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ 110 సెక్షన్ కింద దుకాణ నిర్వాహకుడు సతీశ్ బచా(54)పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నారు.
Similar News
News February 12, 2026
Way2 ఎఫెక్ట్.. యానాది కుటుంబాలకు విముక్తి

నాగయలంక మండలం ఈలచెట్లదిబ్బలో యానాది కుటుంబాలతో వెట్టిచాకిరి చేపిస్తున్న ఘటనపై Way2Newsలో ‘<<19085249>>మాకు విముక్తి కల్పించండి సార్<<>>’ అనే వార్త పబ్లిష్ అయ్యింది. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేసి 27 యానాది సంచార కుటుంబాలను పరిశీలించగా, 11 కుటుంబాలకు విముక్తి కల్పించి స్వగ్రామాలకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న దళారులను పోలీసులు అడ్డుకున్నారు. మిగిలిన 16 కుటుంబాలు ఇక్కడే ఉంటామని తెలిపాయి.
News February 12, 2026
BNGR:మున్సిపల్ ఎన్నికలు అప్పుడు అలా.. ఇప్పుడిలా..!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 2020లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 2026లో 2 శాతం మేర తగ్గింది. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో మొత్తం 1,30,192 ఓటర్లు ఉండగా 1,13,398 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 87.1 శాతం పోలింగ్ నమోదయింది. ఓటింగ్ శాతం తగ్గాడానికి కారణాలు కామెంట్ చేయండి.
News February 12, 2026
అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే ప్రశ్న.. మంత్రి రిప్లై

★ ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రశ్నలు:
☞ పుట్టపర్తిలో IIIT ఏర్పాటు చేయాలి
☞ ఒంగోలు ఐఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్, మెటీరియర్ సైన్స్ కోర్స్‌లు ప్రవేశపెట్టాలి
☞ అసంపూర్తిగా ఉన్న బుక్కపట్నం డిగ్రీ కళాశాల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్
★ మంత్రి నారా లోకేశ్ రిప్లై:
☞ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే డిమాండ్లను పరిష్కరిస్తాం.


