News April 27, 2024

175లో 150 సీట్లు కూటమి గెలుస్తుంది: మాండ్ర శివానందరెడ్డి

image

రాష్ట్రంలో ఉన్న 175 సీట్లలో 150 సీట్లు కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు సాగు, తాగు నీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో 150 సీట్లతో టీడీపీ కూటమి గెలుస్తుందన్నారు.

Similar News

News November 7, 2025

బస్సుల్లో భద్రతా తనిఖీలు ముమ్మరం

image

ఇటీవల బస్సు ప్రమాదం నేపథ్యంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు పోలీసులు రాత్రిపూట తిరిగే బస్సులు, లారీలు, తదితర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వాహన పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు పరిశీలిస్తూ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో, లేదో చెక్ చేస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ‘ఫ్రెష్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తూ డ్రైవర్లకు నీటితో ముఖం కడిగించించి, నిద్ర మత్తు వదిలిస్తున్నారు.

News November 7, 2025

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు: ఎస్పీ

image

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లాలో పోలీసు అధికారులు స్కూల్, కళాశాలల్లో అవగాహన కల్పించారు. ఆటోలు, బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణం చేయరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఓవర్‌ లోడింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం మానుకోవాలని సూచించారు.

News November 7, 2025

ఈనెల 12న RUకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక: వీసీ

image

ఈ నెల 12న రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాన్వకేషన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ వెంకట బసవరావు వెల్లడించారు. శుక్రవారం యూనివర్సిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది స్కాలర్లకు కాన్వకేషన్ పట్టాలు, 18,396 మందికి ఓడీ ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు.