News January 25, 2026

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయండిలా..

image

ఈ రోజుల్లో ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఓ వైపు ఆఫీస్.. మరోవైపు ఇల్లు.. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి మహిళలు తమ చుట్టూ హెల్పింగ్ మెకానిజం‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి పనుల్లో కుటుంబసభ్యులు సాయం తీసుకోవాలి. కుదిరినప్పుడల్లా వారితో సమయం గడపాలి. ఆఫీస్‌లో వర్క్ లోడ్ ఎక్కువైతే సహోద్యోగులతో పని పంచుకోండి. అవసరమైనప్పుడు మీరూ వారికి సాయపడితే ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

Similar News

News February 6, 2026

తెలంగాణలో 336 వార్డుల్లో జనసేన పోటీ

image

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో తమ పార్టీ పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ADB, నల్గొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని పేర్కొంది. ఇప్పటికే B-ఫారమ్స్ దాఖలు చేయగా, రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించారని తెలిపింది. వీరంతా గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు వివరించింది.

News February 6, 2026

క్లాడ్ 4.6 ఓపస్: పనులన్నీ చిటికెలో.. IT ఉద్యోగుల ఆందోళన ఇదే..

image

ఆంథ్రోపిక్ కొత్తగా రిలీజ్‌ చేసిన Claude Opus 4.6 మోడల్ ప్రొఫెషనల్ పనుల కోసం డిజైన్ చేశారు. ఇది కాంప్లెక్స్ కోడింగ్‌ను సెకన్లలో డీబగ్ చేస్తుంది. భారీ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. వేల పేజీల డాక్యుమెంట్లను సెకన్లలో రీసెర్చ్ చేస్తుంది. ఫైనాన్షియల్ అనాలసిస్, ఎక్సెల్ షీట్లు, ప్రజెంటేషన్లను తయారు చేయడంలో ఇది దిట్ట. దీని రాకతో IT రంగంలో జాబ్స్ పోతాయంటూ <<19066930>>ఆందోళన<<>> వ్యక్తమవుతోంది.

News February 6, 2026

గుడిలో తలమీద శఠగోపం ఎందుకు పెడతారు?

image

ఆలయంలో దర్శనం తర్వాత తలపై శఠగోపం పెడతారు. ఆ సమయంలో మనసులో కోర్కెను కోరాలని పండితులు సూచిస్తున్నారు. పూజారికి కూడా వినిపించనంత మెల్లగా మనసులో తలుచుకోవాలని చెబుతారు. ఎందుకంటే.. ఇది మానవునికి శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు దూరంగా ఉంటామని దేవుని ముందు తలవంచి అంగీకరించడం. ఇలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరడమే కాకుండా, మనసులోని దుర్గుణాలు తొలగి ప్రశాంతత లభిస్తుందని నమ్మకం.