News January 25, 2026

తూ.గో జిల్లా వాసికి పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

image

రాజమండ్రికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గతంలో టీటీడీ, అహోబిలం, కంచికోటి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. అన్నమాచార్య సంకీర్తనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. వేలాది కీర్తనలకు స్వరకల్పన చేసిన గరిమెల్లకు ఈ గౌరవం దక్కడంపై సంగీత ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 10, 2026

MLA, MLCలకు క్రీడలు: అయ్యన్న

image

AP: MLA, MLCలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఇవి జరుగుతాయన్నారు. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, కబడ్డీ, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, చెస్ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోటీలు జరుగుతాయని వెల్లడించారు. క్రీడలన్నీ అసెంబ్లీ ప్రాంగణంలోనే జరగనున్నాయని తెలిపారు.

News February 10, 2026

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించాలి: కలెక్టర్

image

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఈనెల 17న జిల్లా వ్యాప్తంగా జయప్రదంగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో గోడ పత్రాలను విడుదల చేశారు. 3–18 ఏళ్లలోపు 3,29,850 మంది చిన్నారులకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భోజనం అనంతరం మాత్రలు నమిలి మింగేలా అవగాహన కల్పించాలని, పోషణ లోపం, రక్తహీనత నివారణపై దృష్టి సారించారు.

News February 10, 2026

కరీంనగర్: ముగిసిన పోలింగ్ సామాగ్రి తరలింపు

image

కరీంనగర్ నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి 477 కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి తరలింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యవేక్షణలో 93 బస్సుల్లో సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచే 66 డివిజన్లలోని 3.40 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.