News January 25, 2026

ఏ తిథి రోజున ఎవరిని ఆరాధించాలంటే..? (2/2)

image

నవమి: కష్టాల తొలగింపు, మేధస్సు కోసం రాముడు.
దశమి: ఆయుష్షు, అపమృత్యు దోష నివారణకై యముడు.
ఏకాదశి: పాప పరిహారం, మోక్షం కోసం విష్ణుమూర్తి.
ద్వాదశి: పుణ్య ఫలం, స్థిరత్వం కోసం వరాహస్వామి.
త్రయోదశి: కోరికలు నెరవేరడం, ఆనందంకై శివుడు.
చతుర్దశి: గ్రహ దోష నివారణ కోసం శివుడు, రుద్రుడు.
పూర్ణిమ: మనశ్శాంతి, ఐశ్వర్యం కోసం చంద్రుడు/లలితా దేవి.
అమావాస్య: పితృ రుణ విముక్తి, వంశాభివృద్ధికై పితృదేవతలు.

Similar News

News February 27, 2026

అధిక యూరియాతో పంటకు కలిగే నష్టాలు

image

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.

News February 27, 2026

రాష్ట్రంలో 43 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

తెలంగాణ హైకోర్టులో 43 పోస్టులకు( ఆఫీస్ సబార్డినేట్ 34, డ్రైవర్ 9) అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఏడో తరగతి, టెన్త్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు అర్హులు. వయసు 18 నుంచి 46ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ , వైవా వోస్, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tshc.gov.in

News February 27, 2026

ఉగాది నాడు మూసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన?

image

TG: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఉగాది రోజున శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.5,000Cr అవసరమని అంచనా వేస్తున్నారు. రూ.4,100Cr ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అందించనుండగా మిగతాది ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మిస్తారు.