News January 25, 2026

అభిమానికి గోల్డ్ చైన్ ఇచ్చిన రజినీకాంత్

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానికి బంగారు గొలుసు ఇచ్చారు. మధురైలో పేదల కోసం కేవలం రూ.5కే పరోటా విక్రయిస్తున్న ‘రజినీ శేఖర్’ సేవలను ప్రశంసించారు. శేఖర్ కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో బిజీగా ఉండగా, ఏప్రిల్ నుంచి సిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Similar News

News February 10, 2026

CMపై భూకబ్జా ఆరోపణలు..రూ.500 కోట్లకు పరువు నష్టం దావా

image

రాష్ట్రంలో సుమారు 7,440 ఎకరాల భూమిని తాను, కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్టు చేసిన ఆరోపణలను అస్సాం CM హిమంత బిశ్వ శర్మ ఖండించారు. తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగోయ్‌‌పై రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్టు SM ద్వారా CM తెలిపారు. ఆధారాలు ఉంటే కోర్టులో నిరూపించాలని డిమాండ్ చేశారు.

News February 10, 2026

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌లో 376 పోస్టులు

image

న్యూఢిల్లీలోని <>నేషనల్<<>> ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ 376 సైంటిఫిక్/ టెక్నికల్ అసిస్టెంట్ -A పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MSc/MS/MCA/BE/BTech, GATE స్కోరు సాధించి వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.35,400-రూ.1,12,400 చెల్లిస్తారు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. సైట్: recruitment.nic.in

News February 10, 2026

FLASH: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంకాలానికి కాస్త పెరిగింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,58,780కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.800 ఎగబాకి రూ.1,45,550 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.