News January 25, 2026

గొల్లప్రోలులో డొక్కా సీతమ్మ విగ్రహం తొలగింపు

image

గొల్లప్రోలు మండలం తాటిపర్తి రోడ్డు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ విగ్రహాన్ని అధికారులు ఆదివారం తొలగించారు. 216వ జాతీయ రహదారి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం ఉందంటూ నగర పంచాయతీ, పోలీసు అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అనంతరం విగ్రహాన్ని కార్యాలయానికి తరలించి భద్రపరిచారు. ముందస్తు అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Similar News

News January 29, 2026

ఉపవాసంలో ఏయే పదార్థాలు తీసుకోవచ్చు?

image

ఏకాదశి ఉపవాసంలో ధాన్యాలకు(బియ్యం, గోధుమలు) దూరం ఉండాలి. పాలు, పెరుగు, వెన్న వంటి పాడి పదార్థాలు కొద్దిమేర తీసుకోవచ్చు. అన్ని రకాల పండ్లు కూడా తినవచ్చు. జ్యూస్ చేసుకుంటే మాత్రం చక్కెరకు దూరం ఉండటం మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సాధారణ ఉప్పు వాడకూడదట. బదులుగా సైంధవ లవణం వాడాలని పండితులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగుతుండాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తినొచ్చు.

News January 29, 2026

మొక్కజొన్న ఆకులు ఈ రంగులోకి మారాయా?

image

మొక్కజొన్న ఆకులు ఊదా, వంకాయ రంగులోకి మారితే అది భాస్వరం లోపం. చలి తీవ్రత వల్ల భూమిలో భాస్వరం ఉన్నా మొక్క తీసుకోలేదు. దీని వల్ల మొక్కలు ఎదగక వేర్లు బలహీనపడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 10గ్రా. DAP లేదా 19:19:19 ఎరువును కరిగించి పంటపై పిచికారీ చేయాలి లేదా నానో DAP లీటరు నీటికి 2ml చొప్పున కలిపి వారం వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. సిలికాన్ జిగురు కలిపి పిచికారీ చేస్తే మరింత లాభం.

News January 29, 2026

మేడారం జాతరకు సెలవులు ఇవ్వాలి: VHP

image

TG: మేడారం మహా జాతర సందర్భంగా ఈ నెల 30,31న రాష్ట్రవ్యాప్తంగా అధికారిక సెలవులు ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ బాలస్వామి డిమాండ్ చేశారు. మేడారంలో క్యాబినెట్ భేటీ నిర్వహించిన CM రేవంత్ సెలవులపై ఎందుకు ప్రకటన చేయడం లేదని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అని చెప్పుకుంటున్న సర్కార్ వేడుకలకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదని ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు.