News January 25, 2026

పద్మ అవార్డు గ్రహీతలకు మోదీ అభినందనలు

image

పద్మ <<18955699>>అవార్డు<<>> గ్రహీతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. “పలు రంగాలలో అద్భుత సేవలు చేసిన పద్మ అవార్డు గ్రహీతల కృషి యువతకు స్ఫూర్తి” అని కొనియాడారు. అదే విధంగా TG సీఎం రేవంత్ రెడ్డి, AP సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిని అభినందించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, కళారంగంలో దీపికా రెడ్డి, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ సహా తదితరులు పురస్కారాలకు ఎంపికయ్యారు.

Similar News

News February 9, 2026

ఫిబ్రవరి 9: చరిత్రలో ఈరోజు

image

♦︎ 1966: బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ జననం ♦︎ 1969: బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు ♦︎ 1975: సినీ నటుడు సుమంత్ జననం (ఫొటోలో) ♦︎ 2008: సంఘ సేవకుడు, పద్మశ్రీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత మురళీధర్ దేవదాస్ ఆమ్టే మరణం ♦︎ 2012: సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మరణం.

News February 9, 2026

నేపాల్‌కు డేల్ స్టెయిన్ బంపర్ ఆఫర్

image

T20WCలో ఇంగ్లండ్‌తో మ్యాచులో దాదాపు గెలిచినంత పనిచేసిన <<19085895>>నేపాల్‌<<>>పై మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైతే తన సేవలు నేపాల్‌కు అందించేందుకు సిద్ధమని సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ ట్వీట్ చేశారు. మరోవైపు చివరి బంతివరకు పోరాడిన నేపాల్ పట్ల మరింత గౌరవం పెరిగిందని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ Xలో రాసుకొచ్చారు. ప్రపంచమంతా నేపాల్ ఎదుగుదలను గమనిస్తోందని పేర్కొన్నారు.

News February 9, 2026

T20IWC: మా జట్టు బలంగా ఉంది: ట్రంప్

image

ఇండియా, శ్రీలంక వేదికగా T20I WC జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. ‘ఇండియాలో WC జరుగుతుందని తెలిసింది. యూఎస్‌కు నా బెస్ట్ విషెస్. మా జట్టు చాలా బలంగా ఉంది. మీకు మా ప్రోత్సాహం ఉంటుంది’ అని తెలిపారు. గ్రూప్-ఏలో ఉన్న USA తమ రెండో మ్యాచ్ ఈ నెల 10న పాకిస్థాన్‌తో ఆడనుంది. తొలి మ్యాచులో భారత్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.