News January 25, 2026
రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం: సీఎం

AP: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రాజెక్టులకు నిధులు సాధించాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం-నల్లమల సాగర్, అమరావతికి చట్టబద్ధతను ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలని చెప్పారు. కేంద్ర మంత్రులు, అధికారులతో టచ్‌లో ఉండాలని పేర్కొన్నారు. సభలో ప్రతి ఒక్కరూ మాట్లాడాలని సూచించారు.
Similar News
News February 11, 2026
CMETలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ(CMET) 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech/MSc/ME/MTech/PhD, MBA/PGDM/MMS/MCom, BCom, పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cmet.gov.in
News February 11, 2026
నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ సాధ్యమేనా?

ప్రసవ సమయంలో మహిళలు భరించలేని నొప్పిని అనుభవిస్తారు. అయితే నార్మల్ డెలివరీలోనూ నొప్పిలేకుండా డెలివరీ చెయ్యొచ్చంటున్నారు నిపుణులు. నొప్పులు మొదలై గర్భాశయ ముఖద్వారం కనీసం 4సెంటీమీటర్లు తెరుచుకున్నాక మత్తు డాక్టర్ సాయంతో ఎపిడ్యూరల్ ఎనాల్జీషియా ఇస్తారు. దీనివల్ల సంకోచ వ్యాకోచాలకు ఇబ్బంది ఉండదు. ఏవైనా కాంప్లికేషన్లు వచ్చి నార్మల్ డెలివరీ కాకపోతే వెంటనే సిజేరియన్ చేయొచ్చని సూచిస్తున్నారు.
News February 11, 2026
అరటిలో కాయ ముచ్చిక కుళ్లు తెగులు- నివారణ

ఈ తెగులు పెద్ద పచ్చ అరటి, చిన్న పచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకాలను ఎక్కువగా ఆశిస్తుంది. కాయల చివర ముచ్చిక వద్ద నల్లగామాడిన కుళ్లు మచ్చలు ఏర్పడి కాలిన చుట్ట చివర వలె కనబడుతుంది. గెలలో కొన్ని కాయలపై ముందుగా తెగులు కనిపించి క్రమేపీ చాలా కాయలకు వ్యాపిస్తుంది. ఈ తెగులు నివారణకు గెలలు పూర్తిగా తడిసేలా లీటరు నీటికి కార్బండిజమ్ 1గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.


