News January 25, 2026
శ్రీకాకుళం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజా ఫిర్యాదుల నమోదుని రద్దు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని జరిగే ఈ కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు అర్జీదారులు ఎవరు జిల్లా కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 30, 2026
శ్రీకాకుళం కలెక్టర్ సీరియస్

జగన్నాథ సాగర్ ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై కలెక్టర్ దినకర్ స్పందించారు. శుక్రవారం ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. చెరువు పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను జేసీబీలతో తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో 24 గంటల్లోగా ఆక్రమణలన్నీ తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి వివరించారు.
News January 30, 2026
శ్రీకాకుళం: ఫాలోవర్లకు నకిలీ పాసులు వచ్చాయా?

అరసవల్లి ఆదిత్యుని రథసప్తమి వీఐపీ పాసులు, తదితర టిక్కెట్ల నకిలీ ముద్రణ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ వేడుకల్లో సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లను ప్రచారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇచ్చారా? అదే అదునుగా ఈ నకిలీ పాస్‌లు ముద్రించారానే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. వీరికి అండగా నిలిచిందెవరు? నకిలీ పాసులతో రద్దీ ఎక్కువైందా? పలు కోణాల్లో ఖాకీలు దర్యాప్తు చేస్తున్నారు.
News January 30, 2026
శ్రీకాకుళం: సూసైడ్ చేసుకుంటానని ఫొన్..కాపాడిన పోలీసులు

శ్రీకాకుళం(D) పోలాకి(M) చెందిన ఓ మహిళ గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబీకులకు ఫొన్ చేసింది. వారు ఆందోళన చెంది 112 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. కంట్రోల్ రూం పోలాకి పోలీసులకు విషయం తెలపగా ఎస్సై రంజిత్ సదరు మహిళకు ఫొన్‌లో కాంటాక్టై ఆమదాలవలస పరిసర ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం జీఆర్పీ, లోకల్ పోలీసులకు సమాచారమివ్వడంతో మహిళను సురక్షితంగా కాపాడారు.


