News January 25, 2026
టీమ్ ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించింది. సంజూ డకౌటైనా అభిషేక్(68*), సూర్యకుమార్(57*) ధాటిగా ఆడారు. పవర్ ప్లే ముగిసేలోపే అభిషేక్ ఫిఫ్టీ నమోదు చేశారు. ఇషాన్(28) సైతం ధనాధన్ ఇన్నింగ్సు ఆడారు. ఈ విజయంతో 5 T20Iల సిరీస్‌ను 3-0తో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. మరో 2 టీ20లు నామమాత్రం కానున్నాయి.
Similar News
News February 22, 2026
సాయిపల్లవి @ 7 ఫిల్మ్ ఫేర్స్

హీరోయిన్ సాయిపల్లవి అరుదైన ఘనత సాధించారు. పదేళ్ల వ్యవధిలో 3 భాషల్లో ఏకంగా ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్న నటిగా నిలిచారు. 2015లో ప్రేమమ్(మలయాళం) చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగులో ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, తమిళంలో గార్గి, అమరన్(లేటెస్ట్) సినిమాలకు ఉత్తమ నటిగా, విరాటపర్వం మూవీకి ఉత్తమ నటి(క్రిటిక్స్) పురస్కారాలు పొందారు.
News February 22, 2026
IIT తిరుపతిలో ఉద్యోగాలు

ఐఐటీ తిరుపతి ఇన్‌స్టిట్యూట్ కౌన్సెలర్(2), సైకోమెట్రిక్ నర్స్ (1)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MPhil(క్లినికల్ సైకాలజీ), MSc/BSc(సైకియాట్రిక్ నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్/రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iittp.ac.in
News February 22, 2026
పొగపెట్టి ఎలుకలను నిర్మూలించడం

పొగపెట్టి ఎలుకలను నిర్మూలించే విధానాన్ని పంట ఏ దశలోనైనా అనుసరించవచ్చు. బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా ఎలుకలు ఉండే కన్నాలలో పొగను వదిలి సులువుగా చంపవచ్చు. అయితే పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లను మట్టితో మూసివేయాలి. పొగను కనీసం మూడు నిమిషాలు వదలాలి. ఇలా చేస్తే ఒకే కన్నంలో వివిధ దశలలో ఉన్న ఎలుకలను నిర్మూలించవచ్చు. తదుపరి సీజన్‌లో వాటి ఉద్ధృతిని తగ్గించవచ్చు.


