News January 25, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ భద్రాచలం: పాపికొండలకు లాంచీలు లేక పర్యాటకుల ఆందోళన
✓ బూర్గంపాడు: అదుపుతప్పిన కారు.. వ్యక్తికి గాయాలు
✓ కొత్తగూడెం: జాతీయ ఓటర్ల దినోత్సవం.. సైక్లింగ్ ర్యాలీ
✓ కొత్తగూడెం సింగరేణి ఏరియాలో కేంద్రమంత్రి పర్యటన
✓ కొత్తగూడెం, ఇల్లందు డీఎస్పీలుగా ఆదినారాయణ, సారంగపాణి
✓ దమ్మపేట: సర్పంచ్‌పై దాడి.. నిందితులపై అట్రాసిటీ కేసు

Similar News

News January 28, 2026

విశాఖలో భూముల విలువలకు భారీ పెంపు!

image

మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో భూముల మార్కెట్‌ విలువను భారీగా పెంచుతూ భారీగా పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా మధురవాడలో 15 నుంచి 30 శాతం మేర ధరలు పెరగనున్నాయి. ఉడా 100 అడుగుల రోడ్డులో గజం ధర రూ.54 వేల నుంచి రూ.72,500కు, కమర్షియల్ స్థలాలు రూ.84 వేలకు చేరాయి. ఐటీ పార్కు, వీఐపీ రోడ్డు, సీతమ్మధార తదితర ప్రాంతాల్లోనూ పెంపుదల ప్రతిపాదించడంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

News January 28, 2026

ఫ్రీగా AI సర్టిఫికేషన్‌ కోర్స్

image

విద్యార్థులు, టీచర్లకు జియో సంస్థ AIపై 4 వారాల ఫ్రీ ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సును ప్రారంభించింది. గూగుల్‌ జెమిని ప్రో భాగస్వామ్యంతో ఈ ట్రైనింగ్‌ను రూపొందించారు. ఇప్పటికే AP, TGలో పలువురు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. <>Jio.com/ai-classroom<<>> వెబ్‌సైట్ ద్వారా ఇందులో జాయిన్ అవ్వొచ్చు. మరోవైపు Jio 5G సబ్‌స్క్రైబర్‌లకు రూ.35,100 విలువైన జెమిని ప్రో ప్లాన్‌ను 18 నెలలు ఫ్రీగా అందిస్తున్న విషయం తెలిసిందే.

News January 28, 2026

మెదక్: నేతల సర్వేలు.. ఆశావహుల ఆఫర్లు

image

ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి నామినేషన్ల షురూ కావడంతో కౌన్సిలర్ టికెట్ల కోసం ఆశావహులు ప్రధాన పార్టీల నేతల వద్ద పైరవీలు చేస్తున్నారు.”నాకు టికెట్ ఇస్తే గెలుపు పక్కా” అంటూ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపిక కోసం సర్వే నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో ఆశావహులు, నేతల్లో టెన్షన్ మొదలైంది.