News January 26, 2026

T20Iల్లో టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

image

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా స్కోరు 19(3.1 ఓవర్లు) బంతుల్లోనే 50 దాటింది. T20Iల్లో భారత్‌కు ఇదే అత్యంత వేగమైన 50 కావడం విశేషం. 2023లో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా 22(3.4 ఓవర్లు) బంతుల్లో ఫిఫ్టీ స్కోర్ చేసింది. 2021లో స్కాట్లాండ్‌పై, 2022లో ఆస్ట్రేలియాపై 3.5 ఓవర్లలో 50 స్కోర్ చేసింది.

Similar News

News February 21, 2026

ALERT: మూడ్రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి 3 రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. వరి ప్రారంభ దశలో, మొక్కజొన్న కంకి దశలో ఉన్నాయి. దీంతో వర్షాల వల్ల నష్టం కలిగే ఆస్కారం ఉంది. రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News February 21, 2026

సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రపై నాసా సంచలన రిపోర్టు!

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ <<15733376>>అనివార్య కారణాలతో<<>> కొన్ని నెలలు స్పేస్‌లోనే ఉండిపోవడం తెలిసిందే. దీనిపై నాసా సంచలన రిపోర్టు రిలీజ్ చేసింది. స్టార్ లైనర్ వ్యోమనౌక తీవ్ర సాంకేతిక వైఫల్యాలకు లోనైందని తెలిపింది. అది ప్రాణాంతక వైఫల్యమని పేర్కొంటూ టైప్-ఏ ప్రమాదంగా వర్గీకరించింది. భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను పక్కనపెట్టి ప్రయోగాన్ని చేపట్టేందుకు నాసా మేనేజర్లపై ఒత్తిడి తెచ్చినట్లుగా గుర్తించింది.

News February 21, 2026

సునీతా విలియమ్స్ యాత్ర.. అప్పుడేమైంది?

image

నాసా రిపోర్టు ప్రకారం.. 2024 జూన్‌లో వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లగానే దానిని నడిపించే ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్య వచ్చింది. ISSకు చేరుకునే సరికి 5 థ్రస్టర్లు/మినీ ఇంజిన్లు పని చేయడం ఆగిపోయాయి. హీలియం లీకేజ్ మొదలైంది. అయితే డాకింగ్ జరగడంతో వ్యోమగాములు ISSలోకి వెళ్లగలిగారు. స్టార్ లైనర్‌ను ఖాళీగానే కిందికి తీసుకొచ్చారు. చివరికి 2025 మార్చిలో స్పేస్ ఎక్స్ నౌకలో సునీత, విల్మోర్ భూమికి చేరుకున్నారు.