News January 26, 2026
యాదాద్రి: మున్సిపల్ పోరు.. వైస్ ఛైర్‌పర్సన్ పదవిపై నేతల గురి

మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఛైర్‌పర్సన్ పదవికి రిజర్వేషన్లు అడ్డంకిగా మారిన కొందరు నేతలు వైస్ ఛైర్‌పర్సన్ పీఠంపై కన్నేశారు. కౌన్సిలర్‌గా గెలవడమే కాకుండా, తమ వర్గం వారిని మెజారిటీ స్థానాల్లో గెలిపించుకుని పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. వైస్ ఛైర్‌పర్సన్లు సైతం కీలక నిర్ణయాల్లో ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉండటంతో ఈ పదవికి రాజకీయ వర్గాల్లో డిమాండ్ పెరిగింది.
Similar News
News February 10, 2026
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం: MNCL కలెక్టర్

మున్సిపల్ పోలింగ్‌కు జిల్లాలోని 1 కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ 60 డివిజన్లకు 265 కేంద్రాలు, బెల్లంపల్లి 34 వార్డులకు 68 కేంద్రాలు, చెన్నూర్‌లో 18వార్డులకు 36 కేంద్రాలు, క్యాతన్‌పల్లిలో 22 వార్డులకు 45 కేంద్రాలు, లక్షెట్టిపేట 15 వార్డులకు 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News February 10, 2026
1300 మందితో బందోబస్తు: కరీంనగర్ సీపీ

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో నిఘా పెంచామన్నారు. సున్నిత కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 10, 2026
క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు: కలెక్టర్

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం క్యాబ్ బుకింగ్ విధానంలోనే వ్యవసాయానికి డ్రోన్ సేవలను కూడా సులభంగా బుక్కు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులు, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఏలూరులో కలెక్టర్ ఆవిష్కరించారు.


