News January 26, 2026
సోమవారం ‘పీ.జీ.ఆర్.ఎస్’ రద్దు: డీఆర్‌వో

ఏలూరు జిల్లాలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అర్జీదారులు, ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News January 28, 2026
వికారాబాద్: తొలిరోజు.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..?

వికారాబాద్ జిల్లాలో తొలిరోజు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన పరిగిలో 2, తాండూర్ 11, వికారాబాద్‌లో 12 నామినేషన్లను అభ్యర్థులు వేశారు. కాగా CM ఇలాకా అయిన కొడంగల్‌లో ఒక్క నామినేషన్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అయితే తొలిరోజు మందకొడిగా ఈ ప్రక్రియ సాగినా రేపట్నుంచి వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.
News January 28, 2026
కృష్ణా: పవన్ కళ్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ను ఎంపీ కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు పనులు, నియోజకవర్గ సమస్యలను పవన్ దృష్టికి బాలశౌరి తీసుకెళ్లారు.
News January 28, 2026
ప్రభుత్వ పథకాలను రైతులకు చేరువ చేయండి: కలెక్టర్

జిల్లాలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులకు ఖర్చులకు అనుగుణంగా పంట రుణాల మంజూరుకు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (కేడిసిసి) ఎన్టీఆర్ జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో జరిగింది. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ పంటల సాగు వ్యయం, పంట దిగుబడి విలువ, రుణ పరిమితి వివరాలను కలెక్టర్ పరిశీలించారు.


