News January 26, 2026

రాజమండ్రి: సమానత్వానికి ఆమె జీవితమే నిదర్శనం

image

రాజమండ్రికి చెందిన దువ్వూరి సుబ్బమ్మ బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరించి జైలుకు వెళ్లిన తొలి ఆంధ్ర మహిళగా నిలిచారు. ఆమె లాంటి వారి ధైర్యం వల్లే నేడు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను మహిళలు అనుభవిస్తున్నారు. గణతంత్ర ఉత్సవాల వేళ పౌర హక్కుల కోసం పోరాడిన దువ్వూరి లాంటి వారి స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. స్త్రీ, పురుష సమానత్వం అనే రాజ్యాంగ సూత్రానికి ఆమె జీవితమే ఒక నిదర్శనం.

Similar News

News February 8, 2026

ఆందోల్: మంజీర నదిలో వృద్ధురాలి మృతదేహం కలకలం

image

ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులోని మంజీరా నదిలో సుమారు 65 ఏళ్లున్న ఓ వృద్ధురాలి మృతదేహం కలకలం రేపింది. చాముండేశ్వరి ఆలయ సమీపంలో ఈ మృతదేహాన్ని శనివారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని సిబ్బంది డెడ్ బాడీని బయటకు తీశారు. పోస్టుమార్టానికి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదైంది.

News February 8, 2026

జొన్నలు ఆహారంగా తీసుకుంటున్నారా?

image

జొన్నలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రొట్టె, అంబలి/జావ, కిచిడీ, దోశ/ఇడ్లీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.

News February 8, 2026

విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే!

image

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్‌‌ లెస్ కేజీ రూ. 280, స్కిన్‌ రూ. 270లుగా విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు సమాచారం. మటన్ కేజీ రూ. 1000లగా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220లు, 30 కోడిగుడ్లు గతవారం రూ. 165లు ఉండగా నేడు రూ. 153లకు చేరుకుంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి