News January 26, 2026

జనవరి 26: చరిత్రలో ఈరోజు

image

1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ
1957: జమ్మూ కశ్మీర్ రాష్ట్ర అవతరణ
1957: భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ జననం
1968: సినీనటుడు రవితేజ జననం
1986: హీరో నవదీప్ జననం
2001: గుజరాత్‌లో భూకంపం.. 20 వేల మందికిపైగా దుర్మరణం
2010: సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణం
*భారత గణతంత్ర దినోత్సవం

Similar News

News February 13, 2026

శివ నామాలు అర్థాలు ‘‘శూలపాణి’’

image

శివుడి ఆయుధం త్రిశూలం. దీనిని చేతిలో ధరించిన వాడు కాబట్టి ఆయన ‘శూలపాణి’ అయ్యాడు. త్రిశూలంలోని మూడు కొనలు సత్వ, రజ, తమ గుణాలకు; అలాగే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంకేతం. వాటన్నింటినీ తన అధీనంలో ఉంచుకుని లోకాన్ని రక్షించేవాడు శివుడు. మనలోని అరిషడ్వర్గాలను తన శూలంతో సంహరించి, మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం నిరంతరం సిద్ధంగా ఉండే రక్షకుడు ఆయన.

News February 13, 2026

ఘన జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

☛ దేశీ ఆవుపేడ 100kgలు ☛ దేశీ ఆవు మూత్రం 5లీటర్లు ☛ బెల్లం 2kgలు ☛ పప్పు దినుసుల పిండి 2kgలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) ☛ గుప్పెడు పుట్టమట్టి
తయారీ: ఈ పదార్థాలను 100KGలు బాగా చివికిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి, దానిపై 5 లీటర్ల ఆవుమూత్రాన్నిచల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి గోనెపట్టా కప్పాలి. 48 గంటల తర్వాత పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇలా 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది.

News February 13, 2026

ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీలోని <>ICAR<<>>-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 15 (రీసెర్చ్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్, ల్యాబ్ అసిస్టెంట్) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి PhD, MSc(ప్లాంట్ పాథాలజీ/వైరాలజీ/మాలిక్యులార్ బయాలజీ/బయో టెక్నాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్), డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iari.res.in/