News April 27, 2024
రాహుల్ గురించి ‘అమేథీ’ ఏమనుకుంటోంది? – 1/2

గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అమేథీ సీటుపై సస్పెన్స్ వీడట్లేదు. రాహుల్ బరిలో నిలిచిన వయనాడ్ స్థానానికి నిన్న ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల దృష్టంతా తమ ఒకప్పటి కంచుకోట మీదే. అభ్యర్థి ఖరారు కాకపోవడంతో రాహుల్ పోటీ చేసే ఛాన్స్ ఉందని ఆశిస్తున్నాయి. అయితే రాహుల్ తిరిగి రావాలనే ఉత్సాహం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్నంత అమేథీ ప్రజల్లో కనిపించడం లేదనేది విశ్లేషకుల మాట. <<-se>>#Elections2024<<>>
Similar News
News November 2, 2025
సన్నబియ్యంలో కేంద్రం వాటా రూ.42, రాష్ట్రానిది రూ.15: కిషన్ రెడ్డి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని సీఎం రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సన్నబియ్యం స్కీమ్ కేంద్రానిదని, కేజీకి మోదీ సర్కారు రూ.42 ఇస్తే, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమే అని పేర్కొన్నారు.
News November 2, 2025
లైవ్ కాన్సర్ట్.. 73 ఫోన్లు కొట్టేశారు

ప్రముఖ స్పానిష్ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎన్రిక్ ఇగ్లేసియాస్ ఇటీవల ముంబైలో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో దొంగలు చేతివాటం చూపించారు. రూ.23.85 లక్షల విలువైన 73 ఫోన్లను కొట్టేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకు 7 FIRలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత బుధవారం ముంబైలోని MMRDA గ్రౌండులో జరిగిన ఈ కాన్సర్ట్ ఎంట్రీకి మినిమం టికెట్ ధర రూ.7వేలు. 25వేల మందికి పైగా హాజరయ్యారు.
News November 2, 2025
సాగులో వేప వినియోగం – ఫలితాలు అద్భుతం

వ్యవసాయంలో చీడపీడల నివారణలో క్రిమి సంహారక గుణాలు కలిగిన వేప ఉత్పత్తులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వేప నుంచి తయారయ్యే పదార్థాల్లో వేపపిండి, వేప నూనె ముఖ్యమైనవి. వేపనూనె, వేప గింజల కషాయాన్ని ఫార్ములేషన్స్, సస్యరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యాన్నిపెంచడం, నులిపురుగుల నియంత్రణ, భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడి, చీడపురుగుల నియంత్రణకు వేప పిండి ఉపయోగపడుతోంది.


