News January 26, 2026
కొబ్బరిపాలతో చర్మ సంరక్షణ

వంటల్లో ఎక్కువగా వాడే కొబ్బరి పాలు సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్ చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. దాంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గించి యవ్వన చర్మాన్ని ఇస్తాయి. మొటిమలు, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే వీటిని జుట్టుకు పట్టిస్తే కుదుళ్లను దృఢంగా చేస్తాయని చెబుతున్నారు.
Similar News
News February 17, 2026
KCRకి CM రేవంత్, YS జగన్ బర్త్‌డే విషెస్

TG: KCR బర్త్ డే సందర్భంగా పలువురు నేతలు SM వేదికగా ఆయనకు విషెస్ తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో KCRకి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని CM రేవంత్ ఆకాంక్షించారు. ‘నా ఫరెవర్ హీరోకి 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజూ నన్ను ఇన్‌స్పైర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు’ అని KTR ట్వీట్ చేశారు. AP మాజీ సీఎం జగన్, హరీశ్‌రావు తదితరులు విషెస్ తెలియజేశారు.
News February 17, 2026
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్ అయ్యి 83,071 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయి 25,605 వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఎటర్నల్ షేర్లు 1%కుపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్, బీఈఎల్, హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
News February 17, 2026
వేరుశనగలో తెగుళ్ల కట్టడికి సూచనలు

వేరుశనగ పంటలో వైరస్ తెగుళ్ల ముప్పు తగ్గాలంటే లోతైన వేసవి దుక్కులు చేసుకోవాలి. పంట పీకిన తర్వాత అవశేషాలను తొలగించి కాల్చివేయాలి. విత్తనాన్ని 5 సెం.మీ కంటే లోతుగా విత్తకూడదు. కిలో విత్తనానికి మాంకోజెబ్ 3గ్రా+ కార్బండిజమ్‌తో విత్తనశుద్ధి చేయాలి. మొక్కల సాంద్రత చదరపు మీటరుకు వర్షాధారంగా అయితే 33, నీటి వసతి కింద అయితే 44 ఉండేట్లు విత్తుకోవాలి. దీని వల్ల వైరస్ తెగుళ్ల ఉద్ధృతిని తగ్గించవచ్చు.


