News April 27, 2024
సూపర్ 6 కాదు.. సూపర్ 10 ఇచ్చినా గెలవరు: పేర్ని

AP: సూపర్ 6 కాదు.. సూపర్ 10 పథకాలు ఇచ్చినా NDA కూటమి గెలవదని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘ప్రజలను మోసం చేసేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. బాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. సామాజిక భద్రతతో YCP మేనిఫెస్టో రూపొందించాం. మా పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి సాధించాయి. జగన్ అంటే ఒక నమ్మకం. 2019లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. మరోసారి ఇచ్చిన హామీలను కూడా ఆయన నెరవేరుస్తారు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
రోజూ ఉదయాన్నే పఠించాల్సిన మంత్రం

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ |
కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం ||
అర్థం: మన అరచేతి ముందు భాగంలో (వేళ్ల చివర) లక్ష్మీ దేవి (సంపద), మధ్య భాగంలో సరస్వతీ దేవి (జ్ఞానం), మూలంలో గోవిందుడు (శక్తి) నివసిస్తారు. అందుకే ఉదయం వేళ చేతులను చూసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ మంత్రాన్ని నిద్ర లేవగానే పఠిస్తే ఆ రోజు సానుకూలంగా మొదలవుతుందని, రోజంతా దైవశక్తి తోడుగా ఉంటుందని నమ్మకం. <<-se>>#shlokam<<>>
News November 6, 2025
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం: పొన్నం

TG: కేంద్రం ప్రవేశ పెట్టిన పథకంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి రూ.లక్షన్నర వరకు ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య అధికంగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ, రూల్స్‌పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.
News November 6, 2025
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 354 పోస్టులు

<


