News January 26, 2026
అన్నమయ్య: ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన ప్రియాంక(30) ఏర్పేడులో ఈఈగా పనిచేస్తోంది. తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు. ఈక్రమంలో ఓ యువకుడితో ఆమెకు పరిచయం ప్రేమగా మారింది. అతను పెళ్లికి నిరాకరించడంతో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఆమె ఫ్రెండ్ శరణ్య.. ఒంటరిగా ఉండొద్దని తిరుపతిలోని తన ఇంట్లో ప్రియాంకకు ఆశ్రయం ఇచ్చింది. శనివారం శరణ్య, ఆమె భర్త బయటకు వెళ్లిన సమయంలో ప్రియాంక ఊరేసుకుని చనిపోయింది.
Similar News
News February 15, 2026
ఉండవల్లిలో సీఎం పర్యటన.. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

సోమవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు.
News February 15, 2026
రేపు ప్రజావాణి రద్దు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల దృష్ట్యా ఈ వారం ప్రజావాణిని రద్దు చేశామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
News February 15, 2026
రాజన్న సన్నిధిలో క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణ

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ కౌంటర్లను పరిశీలించి, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.


