News January 26, 2026

Republic day Special: స్వాతంత్య్రోద్యమంలో నారీ శక్తి

image

భారత స్వాతంత్య్ర సమరంలో ఎందరో వీరవనితలు పాలుపంచుకున్నారు. 1857కు ముందే రాణి అబ్బక్క చౌతా, రాణి వేలు నాచియార్‌, కిట్టూరు చెన్నమ్మ సమరశంఖం పూరించగా, సిపాయిల ఉద్యమ కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్‌ మహల్‌, 1885లో కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, మేడం కామా, అనీబిసెంట్‌, ముత్తు లక్ష్మిరెడ్డి, లక్ష్మీ సెహగల్‌, సుచేత కృపాలాని, మాతంగిని హజ్రా, కమలాదేవి చటోపాధ్యాయ, అరుణా అసఫ్‌ అలీ కీలకపాత్ర పోషించారు.

Similar News

News February 14, 2026

ఈ నెల 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు

image

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొననుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలుకానున్నట్లు పండితులు తెలిపారు. *ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 *మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12 *ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 *మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 *జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 *జులై: 1, 6, 7, 11 *నవంబర్: 21, 24, 25, 26 *డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12.

News February 14, 2026

రిటైర్మెంట్ లైఫ్ ఫుల్ సేఫ్.. పెన్షన్‌ + హెల్త్ కవర్‌కు PFRDA ప్లాన్!

image

ఇకపై పెన్షన్ స్కీమ్స్‌తో పాటే హెల్త్ కవర్‌నూ అందించేందుకు PFRDA ప్లాన్ చేస్తోంది. రిటైర్మెంట్ తర్వాత వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది లేకుండా ఇన్వెస్టర్ల డబ్బులో 30% వైద్య అవసరాలకు కేటాయించేలా ‘Swasthya’ ప్లాన్‌ను రూపొందించే యోచనలో ఉంది. పెన్షన్ ఫండ్స్ స్పాన్సర్ చేసే ICICI, Axis, Tata వంటివి దీనిపై కసరత్తు చేస్తున్నాయి. దీంతో తక్కువ ప్రీమియంతోనే ఇన్సూరెన్స్, హాస్పిటల్స్‌లో మంచి డిస్కౌంట్లు లభిస్తాయి.

News February 14, 2026

పంటను బట్టి యూరియా వాడితే మంచిది

image

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.